కీర్తనల గ్రంథము
చాప్టర్ 8
1 యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా,భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది.
2 శత్రువులను పగతీర్చుకొనువారిని మాన్పివేయుటకై నీ విరోధులనుబట్టి బాలురయొక్కయు చంటి పిల్లలయొక్కయు స్తుతుల మూలముననీవు ఒక దుర్గమును స్థాపించి యున్నావు.
3 నీ చేతిపనియైన నీ ఆకాశములనునీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా
4 నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు?నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
5 దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు.మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు.
6 నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చి యున్నావు.
7 గొఱ్ఱలన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్య ములను
8 సముద్రమార్గములలో సంచరించువాటి నన్నిటినివాని పాదములక్రింద నీవు ఉంచి యున్నావు.
9 యెహోవా మా ప్రభువాభూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది!