కీర్తనల గ్రంథము
చాప్టర్ 13
1 యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా?నాకెంతకాలము విముఖుడవై యుందువు?
2 ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును?ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?
3 యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము
4 నేను మరణనిద్ర నొందకుండనువాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండనునేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండనునా కన్నులకు వెలుగిమ్ము.
5 నేనైతే నీ కృపయందు నమి్మక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నదియెహోవా
6 నాకు మహోపకారములు చేసియున్నాడునేను ఆయనను కీర్తించెదను.