కీర్తనల గ్రంథము
చాప్టర్ 70
1 దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
2 నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడుచేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.
3 ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయ మొందు దురుగాక
4 నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణను ప్రేమించువారందరు దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక.
5 నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నారక్షణకర్తవు నీవే యెహోవా, ఆలస్యము చేయకుమీ.