కీర్తనల గ్రంథము
చాప్టర్ 128
1 యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.
2 నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించె దవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును.
3 నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.
4 యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును.
5 సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు
6 నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.