యోబు గ్రంథము

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42

చాప్టర్ 20

1 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
2 ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురతతగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.
3 నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నం దుకునా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.
4 దుష్టులకు విజయము కొద్దికాలముండునుభక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును.
5 ఆదినుండి నరులు భూమిమీద నుంచబడిన కాలముమొదలుకొనిఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?
6 వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగిననుమేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను
7 తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు.వారిని చూచినవారువారేమైరని యడుగుదురు.
8 కల యెగసిపోవునట్లు వారు గతించి కనబడక పోవుదురురాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు.
9 వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదువారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు
10 వారి సంతతివారు దరిద్రుల దయను వెదకెదరువారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును.
11 వారి యెముకలలో ¸°వనబలము నిండియుండునుగాని అదియు వారితో కూడ మంటిలో పండుకొనును.
12 చెడుతనము వారి నోటికి తియ్యగా నుండెనువారు నాలుకక్రింద దాని దాచిపెట్టిరి.
13 దాని పోనియ్యక భద్రముచేసికొనిరి, నోట దానినుంచుకొనిరి.
14 అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారిలోపట నాగుపాముల విషమగును.
15 వారు ధనమును మింగివేసిరి గాని యిప్పుడు దానిని మరల కక్కివేయుదురు.
16 వారి కడుపులోనుండి దేవుడు దాని కక్కించును.వారు కట్లపాముల విషమును పీల్చుదురునాగుపాము నాలుక వారిని చంపును.
17 ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు.
18 దేనికొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరోదానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరువారు సంపాదించిన ఆస్తికొలది వారికి సంతోషముండదు
19 వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారువారు బలాత్కారముచేత ఒక యింటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తిచేయరు.
20 వారు ఎడతెగక ఆశించినవారుతమ యిష్టవస్తువులలో ఒకదానిచేతనైనను తమ్మునుతాము రక్షించుకొనజాలరు.
21 వారు మింగివేయనిది ఒకటియు లేదు గనుక వారిక్షేమస్థితి నిలువదు.
22 వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బందిపడుదురుదురవస్థలోనుండు వారందరి చెయ్యి వారిమీదికివచ్చును.
23 వారు కడుపు నింపుకొననైయుండగాదేవుడు వారిమీద తన కోపాగ్ని కురిపించునువారు తినుచుండగా దాని కురిపించును.
24 ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగాఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడు చును.
25 అది దేహమును చీల్చి వారి శరీరములోనుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరములోనుండి పైత్యపు తిత్తి వచ్చును, మరణభయము వారి మీదికి వచ్చును.
26 వారి ధననిధులు అంధకారపూర్ణములగునుఊదనక్కరలేని అగ్ని వారిని మింగివేయునువారి గుడారములో మిగిలినదానిని అది కాల్చివేయును.
27 ఆకాశము వారి దోషమును బయలుపరచునుభూమి వారిమీదికి లేచును.
28 వారి యింటికివచ్చిన ఆర్జన కనబడకపోవునుదేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును.
29 ఇది దేవునివలన దుష్టులైన నరులకు ప్రాప్తించుభాగముదేవునివలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.